అధిక సమయం ఆన్‌లైన్‌లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం

తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్‌లైన్‌లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్‌లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Published : 18 Apr 2024 06:06 IST

ఫిన్లాండ్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి 

దిల్లీ: తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్‌లైన్‌లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్‌లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. బాలుర కన్నా బాలికలే పరిమితికి మించి ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని పేర్కొంది. అయితే బాలికల కన్నా బాలురే ఎక్కువగా బడి ఎగ్గొడుతున్నారని, బాలికలు వైద్య సంబంధిత కారణాలతో అధికంగా పాఠాశాలలకు హాజరుకావడం లేదని చెప్పింది. ఈ మేరకు 86 వేల పైచిలుకు (14-16 వయసున్న) పిల్లల డేటాను విశ్లేషించిన హెల్సింకి విశ్వవిద్యాలయ పరిశోధక బృందం తాము గుర్తించిన అంశాలను ‘ఆర్కైవ్స్‌ ఆఫ్‌ డిసీజ్‌ ఇన్‌ చైల్డ్‌హుడ్‌’ జర్నల్‌లో ప్రచురించింది. అధికంగా ఆన్‌లైన్‌పై సమయాన్ని వెచ్చించడం వల్ల పిల్లల్లో 38 శాతం బడి ఎగ్గొట్టే ప్రమాదం ఉందని, వైద్య సంబంధిత కారణాలతో గైర్హాజరయ్యే ముప్పు 24 శాతం ఉందని వెల్లడించింది. బాలికల్లో 96 శాతం మంది బాలుర కన్నా అధికంగా ఇంటర్నెట్‌ వాడుతున్నారని పేర్కొంది. అలాగే మూడోవంతు మంది పిల్లలు 8 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారని, దాదాపుగా అంతే మంది వ్యాయామం కూడా తక్కువగానే చేస్తున్నారని గుర్తించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని