రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి

ఉక్రెయిన్‌లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్‌ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది.

Published : 18 Apr 2024 05:03 IST

61 మందికి గాయాలు

కీవ్‌: ఉక్రెయిన్‌లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్‌ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. ఇవి 8 అంతస్తుల అపార్టుమెంటును తాకాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. 61 మంది క్షతగాత్రులయ్యారు. ఇందులో ముగ్గురు చిన్నారులూ ఉన్నారు. మరోవైపు యుద్ధంలో రష్యా దూకుడు పెంచింది. భారీస్థాయిలో దాడులు నిర్వహిస్తోంది. ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్‌ దళాలు చాలా ప్రాంతాల్లో వెనక్కి మళ్లుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని