జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్‌ సాన్‌ సూకీ

మయన్మార్‌ కీలక నేత, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది.

Published : 18 Apr 2024 05:06 IST

బ్యాంకాక్‌: మయన్మార్‌ కీలక నేత, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. మయన్మార్‌లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని.. జైలులో ఉన్న వృద్ధ ఖైదీల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు విన్‌ మైంట్‌ (72), సూకీ (78)లను గృహ నిర్బంధానికి తరలించినట్లు సైనిక ప్రభుత్వ ప్రతినిధి మంగళవారం ఓ విదేశీ మీడియా సంస్థకు వెల్లడించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మరో 3వేల మందికిపైగా ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని