జపాన్‌ బుల్లెట్‌ రైల్లో చొరబడ్డ పాము

జపాన్‌ బుల్లెట్‌ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది.

Published : 18 Apr 2024 05:09 IST

టోక్యో: జపాన్‌ బుల్లెట్‌ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. అలాంటిది నగోయా-టోక్యో మధ్య ప్రయాణించిన ఒక షంకెన్‌సేన్‌ రైలు ఏకంగా 17 నిమిషాలు ఆలస్యమైంది. ఈ అరుదైన ఘటనకు ఓ పాము కారణమైంది! మంగళవారం సాయంత్రం ప్రయాణికులు రైల్లో ఓ పామును గుర్తించారు. అయితే అది అక్కడకు ఎలా చేరిందో పరిశీలిస్తున్నామని సెంట్రల్‌ జపాన్‌ రైల్వే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. సాధారణంగా ఈ రైళ్లలో పావురాలు, చిన్న కుక్కపిల్లలను తీసుకెళ్లే వీలుంది. పాములకు మాత్రం అనుమతి లేదు. కాగా, ప్రయాణికుల లగేజీని తాము తనిఖీ చేయబోమని అధికారులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని