కిమ్‌ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!

జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్‌లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.

Published : 19 Apr 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్షిపణి ప్రయోగాలతో నిత్యం బిజీగా ఉండే ఉత్తర కొరియా.. శత్రు దేశాలకు సవాల్‌ విసురుతూనే ఉంటోంది. ఈ క్రమంలో జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక ఒకటి హెచ్చరించింది. వీటిని వ్యాప్తి చేసేందుకు విషపు పెన్నులు, స్ర్పేలను తయారు చేస్తున్నట్లు తెలిపింది. అణ్వాయుధ కార్యక్రమాలపై తక్కువ దృష్టి పెట్టి, ఆంత్రాక్స్‌, స్మాల్‌పాక్స్‌ వంటి వ్యాధులను వ్యాప్తి చేసే ఆయుధాలపై ప్రధానంగా దృష్టిపెట్టినట్లు అమెరికా విదేశాంగశాఖ వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.

‘ఉత్తర కొరియా జాతీయ స్థాయిలో జీవాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. సైనిక అవసరాల కోసం బయోలాజికల్‌ ఏజెంట్లను ఉత్పత్తి చేసే సమర్థత ఉంది. జీవాయుధ కారకాలుగా బ్యాక్టీరియా, వైరస్‌లు, విషాన్ని ఉత్పత్తి చేసే సాంకేతికత కూడా ఆ దేశానికి ఉంది. స్ప్రేయర్లు, విషపు పెన్ను ఇంజెక్షన్ల వంటి సంప్రదాయేతర సాధనాలను జీవాయుధాలుగా మార్చే సామర్థ్యం ఉత్తర కొరియాకు ఉండవచ్చు. CRISPR వంటి సాంకేతికతలతో జీవ ఉత్పత్తులను జన్యుపరంగా మార్చే (Genetically engineer) శక్తి ఉత్తరకొరియాకు ఉంది’ అని అమెరికా విదేశాంగశాఖ నిఘా విభాగం తన నివేదికలో అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని