తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం

సెంట్రల్‌ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్‌ ప్రావిన్స్‌లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Published : 19 Apr 2024 05:09 IST

అంకారా: సెంట్రల్‌ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్‌ ప్రావిన్స్‌లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అంతకుముందు కూడా 4.7 తీవ్రతతో, 4 1 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. రాజధాని అంకారాకు తూర్పున 450 కిలోమీటర్ల దూరంలో సులుసరే పట్టణం ఉంది. యోజ్‌గాట్‌ సహా టొకాట్‌కు చుట్టుపక్కలున్న పలు ప్రావిన్స్‌లలోనూ ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు మీడియా పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని