ఇరాన్‌పై అమెరికా, బ్రిటన్‌ ఆంక్షలు

ఇజ్రాయెల్‌పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్‌పై గురువారం అమెరికా, బ్రిటన్‌ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి.

Published : 19 Apr 2024 05:09 IST

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్‌పై గురువారం అమెరికా, బ్రిటన్‌ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. టెహ్రాన్‌ డ్రోన్‌, క్షిపణి సాంకేతికతను పరిమితం చేసే దిశగా ఈ ఆంక్షలను విధించడం గమనార్హం. డ్రోన్లకు ఇంజిన్లు తయారు చేసే 16 మంది వ్యక్తులను, రెండు సంస్థలను అమెరికా ఆర్థికశాఖలోని విదేశీ ఆస్తుల నియంత్రణ విభాగం ఆంక్షల పరిధిలోకి తెచ్చింది. బ్రిటన్‌ కూడా డ్రోన్‌, బాలిస్టిక్‌ క్షిపణులు తయారు చేసే సంస్థలు, వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుంది. ‘‘ఇరాన్‌ చర్యలను కట్టడి చేయడానికి రానున్న రోజుల్లో మరిన్ని ఆంక్షలు విధిస్తాం’’ అని అమెరికా ఆర్థికమంత్రి జానెట్‌ యెలెన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని