ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది

భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్‌ యంత్రాంగంలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Published : 19 Apr 2024 05:10 IST

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న మస్క్‌ ప్రతిపాదనపై అగ్రరాజ్యం వెల్లడి

వాషింగ్టన్‌: భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్‌ యంత్రాంగంలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమంటూ ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ ముఖ్య ఉప అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ పై వ్యాఖ్యలు చేశారు.  ‘‘ఐరాసలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్‌ గతంలో సర్వ ప్రతినిధి సభలో మాట్లాడారు. విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చారు. భద్రతా మండలి సహా ఐరాస సంస్థల్లో సంస్కరణలకు మేం ఎప్పుడూ అనుకూలమే. ఐరాసలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలి’’ అని మీడియా సమావేశంలో వేదాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని