రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..

బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి.

Published : 19 Apr 2024 05:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. కానీ, బ్రెజిల్‌కు చెందిన ఓ యువతి మాత్రం చనిపోయిన వ్యక్తిని బ్రతికున్నాడంటూ వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి బ్యాంకుకు తీసుకువెళ్లింది. వివరాల్లోకి వెళితే..బ్రెజిల్‌కు చెందిన 42 ఏళ్ల ఎరికా డిసౌజా వియెరా నూనెస్‌ తన సమీప (చనిపోయిన) బంధువు పాలో రాబర్టో బ్రాగా (68)ను రియో డి జనీరోలోని ఓ బ్యాంకుకు తీసుకుని వెళ్లింది. అతడితో మాట్లాడుతూ ఆ వ్యక్తి పరిస్థితిపై అధికారులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. 3,250 డాల్లర్ల (రూ.2.70 లక్షలకు పైగా) రుణం పొందేందుకు ఏమాత్రం కదలిక లేని బ్రాగాతో పత్రాలపై సంతకం చేయించేందుకు ప్రయత్నించింది. సిబ్బందికి అనుమానం రావడంతో ఆమె బండారం బయటపడింది. ఎరికా తీసుకొచ్చింది మృతదేహాన్ని అని తెలిసి అక్కడున్నవారంతా కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని