ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం

ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్‌ రువాంగ్‌లో బుధవారం విస్ఫోటం సంభవించింది.

Published : 19 Apr 2024 05:41 IST

అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత

మనాడో: ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్‌ రువాంగ్‌లో బుధవారం విస్ఫోటం సంభవించింది. దీనిపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. అగ్నిపర్వతం నుంచి భారీగా వెలువడుతున్న పొగ, బూడిద సమీప ప్రాంతాలను కమ్మేసింది. అగ్నిపర్వతం నుంచి ప్రజలు కనీసం 6 కిలోమీటర్ల దూరంలో ఉండాలని అధికారులు సూచించారు. మనాడో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గురువారం నుంచి తాత్కాలికంగా మూసివేశారు. సుమారు 11వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఈ విస్ఫోటం వల్ల పర్వత భాగం సముద్రంలోకి కూలి సునామీ వచ్చే అవకాశం ఉందని దేశ జాతీయ విపత్తు నివారణ సంస్థ ప్రతినిధి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని