చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే

చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్‌ నెల్సన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు.

Published : 19 Apr 2024 06:08 IST

నాసా అధిపతి వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్‌ నెల్సన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్‌ తన రోదసి వ్యవహారాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ సాగిస్తున్న సైనిక కార్యకలాపాలను దాచిపెడుతోందని చట్టసభ సభ్యులకు వెల్లడించారు. ‘‘దశాబ్దకాలంగా ఈ రంగంలో చైనా అసాధారణ ప్రగతి సాధించింది. అదంతా రహస్యంగా సాగింది. పౌర కార్యక్రమాల ముసుగులో సైనిక ప్రాజెక్టులను చేపట్టిందని భావిస్తున్నాం. చంద్రుడిపైకి వెళ్లడం ప్రస్తుతం మాపై ఉన్న బాధ్యత. చైనా అక్కడకు ముందుగానే వెళ్తే.. ఇది మా ప్రదేశం, మీకు స్థానం లేదని పేచీపెట్టే అవకాశం ఉంది. అంతరిక్ష రంగంలో దూసుకెళ్లేందుకు చైనా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తోంది. అన్నింటికి మనం సిద్ధంగా ఉండాలి’’ అని కాంగ్రెస్‌ను కోరారు. 2025 ఏడాదికి నాసా బడ్జెట్‌ కేటాయింపుల అంశంలో భాగంగా అమెరికా ప్రతినిధుల సభకు చెందిన కమిటీ ముందు నెల్సన్‌ హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని