జపాన్‌ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్‌లో ఆత్మాహుతి దాడి యత్నం

పాకిస్థాన్‌లో జపాన్‌ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది.

Published : 20 Apr 2024 05:21 IST

కరాచీ: పాకిస్థాన్‌లో జపాన్‌ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. ఇక్కడి సుజుకీ మోటార్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులతో వెళుతున్న వాహనాన్ని శుక్రవారం ఆత్మాహుతి బాంబర్‌ లక్ష్యంగా చేసుకున్నాడు. అయితే అతడు లక్షిత వాహనం వద్దకు చేరుకోకముందే తననుతాను పేల్చేసుకున్నాడు. ఈ క్రమంలో మరో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. భద్రతా సిబ్బంది అతడిని మట్టుబెట్టారని వెల్లడించారు. ఈ దాడిలో జపనీయులు ఎవరూ గాయపడలేదని అధికారులు స్పష్టంచేశారు. దాడిని తిప్పికొట్టే క్రమంలో గాయపడిన ముగ్గురు ప్రైవేటు భద్రతా సిబ్బందిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని