పారిస్‌లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు

ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్‌లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.

Published : 20 Apr 2024 05:22 IST

పారిస్‌: ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్‌లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు ఓ అనుమానాస్పద వ్యక్తి గ్రెనేడ్‌, పేలుడు పదార్థాలతో సంచరిస్తున్నాడన్న సమాచారంతో కాన్సులేట్‌ భవనాన్ని పోలీసులు, సైనికులు పెద్దఎత్తున చుట్టుముట్టారు. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే అతని వద్ద, అతని వాహనంలో ఎటువంటి ఆయుధాలు లేవని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. అయితే అనుమానితుడు గతేడాది రాయబార కార్యాలయ ద్వారాలకు నిప్పుపెట్టిన కేసులో నిందితుడని పారిస్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో, ఒలింపిక్స్‌కు పారిస్‌ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఆందోళనలు తలెత్తాయి. ఈ పరిణామంపై ఇరాన్‌ రాయబార కార్యాలయం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు