కలరా టీకాలో కొత్త వెర్షన్‌కు డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది.

Published : 20 Apr 2024 05:23 IST

ఐరాస: విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పెరుగుతున్న ఈ వ్యాధి కేసులను ఎదుర్కోవడానికి ఇది దోహదపడుతుందని వివరించింది. కలరా ఉద్ధృతి వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల ఈ టీకా నిల్వలు తగ్గిపోయాయి. దీంతో పేద దేశాలు ఇబ్బందిపడుతున్నాయి. తాజా టీకాను ఈయూబయాలజీస్‌ రూపొందించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన టీకా ఇప్పటికే వినియోగంలో ఉంది. దానికి సంబంధించిన మెరుగైన వెర్షన్‌కు ఇప్పుడు ఆమోదం లభించింది. దీనికి యూవిచోల్‌-ఎస్‌ అని పేరు పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు