ట్రంప్‌ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది.

Published : 20 Apr 2024 05:23 IST

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. అతడు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. మంటల్లో చిక్కుకున్న అతడు నేలపై పడుకొని ఉండటం అందులో కనిపించింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ప్రజలు.. మంటలను ఆర్పేసేందుకు ప్రయత్నించారు. అత్యవసర సిబ్బంది అక్కడికి వచ్చి.. స్ట్రెచర్‌పై అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని