కూలిన రష్యా సూపర్‌ సోనిక్‌ బాంబర్‌ విమానం

రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్‌ సోనిక్‌ బాంబర్‌ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ శుక్రవారం ప్రకటించింది.

Published : 20 Apr 2024 05:24 IST

మేమే పడగొట్టాం: ఉక్రెయిన్‌
కాదు.. సాంకేతిక కారణాలతోనే..: మాస్కో

కీవ్‌: రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్‌ సోనిక్‌ బాంబర్‌ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ శుక్రవారం ప్రకటించింది. తమ వాయుసేన, నిఘా వర్గాలు కలిసి యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్షిపణులతో ఈ బాంబర్‌ను పడగొట్టినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. దీన్ని రష్యా ఖండించింది. సాంకేతికలోపంతోనే బాంబర్‌ స్టావ్రోపోల్‌లోని నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయిందని తెలిపింది. కూలిన బాంబర్‌లోని నలుగురు సిబ్బందిలో ముగ్గురిని కాపాడినట్లు పేర్కొంది. మరొకరి కోసం అన్వేషణ కొనసాగుతున్నట్లు చెప్పింది. అయితే.. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరు మృతి చెందినట్లు స్టావ్రోపోల్‌ గవర్నర్‌ చెప్పారు. మరోవైపు మాస్కో తాజా దాడుల్లో ఉక్రెయిన్‌లోని నిప్రో ప్రాంతంలో ఎనిమిదేళ్ల చిన్నారి సహా 8 మంది మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు