సిరియాలో ఐఎస్‌ ఉగ్రవాదుల దాడి

సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది.

Published : 20 Apr 2024 05:26 IST

22 మంది ప్రభుత్వ అనుకూల ఫైటర్ల హతం

బీరుట్‌: సిరియాలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. మృతులు అందరూ సిరియా ప్రభుత్వ అనుకూల ఖుద్స్‌ ఫోర్స్‌ సభ్యులని మీడియా పేర్కొంది. ఒకప్పుడు ఐఎస్‌ ఉగ్రవాదులకు గట్టిపట్టున్న సుఖ్నా పట్టణంలో ఈ దాడి జరిగింది. రష్యా మద్దతున్న పాలస్తీనా ఫైటర్లు(ఖుద్స్‌ ఫోర్స్‌) సిరియా ప్రభుత్వం తరఫున సాయుధ ఘర్షణల్లో పాల్గొంటున్నారు. కొన్నాళ్లుగా ఈ ప్రాంతంలో నిద్రాణంగా ఉన్న ఐఎస్‌ ఉగ్రవాదులు ఆకస్మికంగా బస్సుపై దాడి చేసి కాల్పులకు తెగబడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని