50 డ్రోన్లు కూల్చాం: రష్యా

ఉక్రెయిన్‌ దూకుడు పెంచింది. రష్యా విద్యుత్కేంద్రాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా భారీ స్థాయి డ్రోన్ల దండును పంపింది.

Published : 21 Apr 2024 05:24 IST

మాస్కో: ఉక్రెయిన్‌ దూకుడు పెంచింది. రష్యా విద్యుత్కేంద్రాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా భారీ స్థాయి డ్రోన్ల దండును పంపింది. కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్లు లక్ష్యాలను తాకినట్లు తెలుస్తోంది. రష్యా మాత్రం 8 ప్రాంతాల్లో 50 డ్రోన్లను కూల్చివేశామని పేర్కొంది. బెల్‌గరోద్‌లోనే 26 డ్రోన్లను పేల్చివేశామని తెలిపింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బ్రయాన్స్క్‌, కుర్స్క్‌, తులా, కలుగా ప్రాంతాల్లో కూడా డ్రోన్లను నేలమట్టం చేశామని రష్యా సైనిక అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని