నా భార్య ఆహారంలో టాయిలెట్‌ క్లీనర్‌ కలుపుతున్నారు

జైల్లో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్‌ క్లీనర్‌ కలిపిన ఆహారం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 21 Apr 2024 06:21 IST

న్యాయమూర్తి ముందు ఇమ్రాన్‌ ఆరోపణ

ఇస్లామాబాద్‌: జైల్లో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్‌ క్లీనర్‌ కలిపిన ఆహారం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం తిన్న వెంటనే ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నారని, ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. 190 మిలియన్‌ పౌండ్ల అవినీతి కేసుపై శుక్రవారం రావల్పిండి జైలు వద్ద కోర్టులో విచారణ సాగింది. తన భార్యకు తగిన వైద్యపరీక్షలు చేయించడం లేదని, తాను ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి లేకుండా అదనంగా బ్యారెల్స్‌ ఏర్పాటు చేశారని న్యాయమూర్తి ఎదుట ఇమ్రాన్‌ ఈ ఆరోపణలు చేశారు. కస్టడీలో ఉన్నప్పుడు మీడియాతో మాటలు తగ్గించుకోవాలని ఇమ్రాన్‌కు న్యాయమూర్తి సూచించారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నందున స్పష్టత ఇవ్వడం కోసం తాను వారితో మాట్లాడుతున్నట్టు మాజీ ప్రధాని తన వాదన వినిపించారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీకి రెండురోజుల్లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని