క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా

ఓ భారీ క్షిపణి వార్‌హెడ్‌ను, విమాన విధ్వంసక క్షిపణిని ప్రయోగించినట్లు ఉత్తరకొరియా శనివారం వెల్లడించింది. దేశ పశ్చిమ తీరంలోని ఓ ప్రాంతం నుంచి ట్రక్కుల ద్వారా ఈ ప్రయోగాలు చేపట్టారు.

Published : 21 Apr 2024 05:25 IST

సియోల్‌: ఓ భారీ క్షిపణి వార్‌హెడ్‌ను, విమాన విధ్వంసక క్షిపణిని ప్రయోగించినట్లు ఉత్తరకొరియా శనివారం వెల్లడించింది. దేశ పశ్చిమ తీరంలోని ఓ ప్రాంతం నుంచి ట్రక్కుల ద్వారా ఈ ప్రయోగాలు చేపట్టారు. అమెరికా, దక్షిణకొరియాలతో సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో తన సైనిక పాటవాన్ని పెంపొందించుకునేందుకు ఉత్తరకొరియా ఇటువంటి ప్రయోగాలను నిర్వహిస్తోంది. అయితే ఈ ప్రయోగాలు తమ సాధారణ సైనిక కార్యకలాపాల్లో భాగమేనని.. వీటికి అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధం లేదని ఆ దేశ జాతీయ మీడియా వెల్లడించింది. శుక్రవారం ప్రయోగించిన ఈ వార్‌హెడ్‌ను హవాసెల్‌-3 క్రూయిజ్‌ క్షిపణి కోసం రూపొందించగా.. విమాన విధ్వంసక క్షిపణి పేరును పైలోజీ-1-2గా ఉత్తరకొరియా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని