సముద్రంలో కుప్పకూలిన రెండు హెలికాప్టర్‌లు

జపాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రివేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన రెండు నౌకాదళ హెలికాప్టర్‌లు సముద్రంలో కుప్పకూలిపోయాయి.

Published : 22 Apr 2024 04:38 IST

జపాన్‌లో ఒకరి మృతి, ఏడుగురు గల్లంతు

టోక్యో: జపాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రివేళ ప్రత్యేక శిక్షణ నిమిత్తం వెళ్లిన రెండు నౌకాదళ హెలికాప్టర్‌లు సముద్రంలో కుప్పకూలిపోయాయి. శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా.. ఏడుగురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలుసుకోవడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెండు హెలికాప్టర్‌లు ఒకదాన్నొకటి ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఎస్‌హెచ్‌-60కె శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్‌లు టోరిషిమా ద్వీపం సమీపంలో కూలినట్లు జపాన్‌ నౌకాదళం ప్రకటించింది. ఘటనకు కారణం తెలిసే వరకు ఈ హెలికాప్టర్‌లపై శిక్షణ కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. హెలికాప్టర్లు కూలిన ప్రాంతాన్ని 12 యుద్ధ నౌకలు జల్లెడ పడుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని