మాకు పురుగుల బియ్యం పంపుతున్నారు

పాకిస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో న్యాణత లోపించిందని రష్యా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 22 Apr 2024 04:39 IST

ఇలాగే కొనసాగితే నిషేధిస్తాం
పాక్‌కు రష్యా హెచ్చరిక

మాస్కో: పాకిస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో న్యాణత లోపించిందని రష్యా మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. తాము దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో హానికరమైన పురుగులను గుర్తించిన మాస్కో అంతర్జాతీయ ఆహార నాణ్యత ప్రమాణాల సంస్థ పాక్‌కు హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే మరోసారి దిగుమతులను నిలిపివేస్తామంటూ రష్యాలోని పాక్‌ దౌత్య కార్యాలయానికి లేఖ రాసింది. ఈ వ్యవహారంపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘనకు అడ్డుకట్ట వేయాలని, వ్యవసాయ ఉత్పత్తుల భద్రతను నిర్ధరించేందుకు బియ్యం ఎగుమతిదారులందరూ తగు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొంది. ఆరోగ్య భద్రత, నాణ్యత ప్రమాణాల కారణాలతో 2006, 2019లో పాకిస్థాన్‌ నుంచి బియ్యం దిగుమతులపై మాస్కో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని