అమెరికాలో కాల్పులు.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు

అమెరికాలోని మెంఫిస్‌ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక పార్కులో జరుగుతున్న ఓ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో ఇద్దరు మరణించారు.

Updated : 22 Apr 2024 05:58 IST

మెంఫిస్‌: అమెరికాలోని మెంఫిస్‌ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక పార్కులో జరుగుతున్న ఓ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన విచక్షణా రహిత కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మెంఫిస్‌ పార్కులో బహిరంగంగా జరుగుతున్న ఓ పార్టీలో శనివారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటన సమయంలో 200 నుంచి 300 మంది పార్టీకి హాజరైనట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు