మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) భారీ విజయాన్ని నమోదు చేసింది.

Updated : 22 Apr 2024 16:36 IST

మాలే: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) భారీ విజయాన్ని నమోదు చేసింది. కడపటి వార్తలు అందేటప్పటికీ ఆ పార్టీ 60కి పైగా స్థానాలను గెల్చుకుంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్‌ మజ్లీస్‌) లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం  పోలింగ్‌ జరిగింది.ముయిజ్జుకు చెందిన పీఎన్‌సీ, ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) సహా ఆరు పార్టీలకు చెందిన 368 మంది బరిలో నిలిచారు.86 నియోజకవర్గాల ఫలితాలను ప్రకటించగా అందులో 60కి పైగా స్థానాలను పీఎన్‌సీ దక్కించుకుంది. మెజార్టీకి అవసరమైన సీట్లను ఆ పార్టీ ఇప్పటికే గెల్చుకుంది. చైనాకు అనుకూలుడిగా నిలిచిన ముయిజ్జుకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా నిలిచాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని