తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!

తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.

Published : 23 Apr 2024 05:05 IST

దిల్లీ: తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు. ఎలుకల్లో జరిగిన పరిశోధనల్లో ఇది వెల్లడైంది. తండ్రి ఎలుక తీసుకునే ఆహారం.. దానితోపాటు దాని పిల్లల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే అది తినే ఆహారంలోని ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు వంటి సూక్ష్మపోషకాల తీరుతెన్నుల వల్ల ఆ జీవికి కలిగే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా అన్నది వెల్లడి కాలేదు. దీనిపై సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ప్రొటీన్లు తక్కువగా, కార్బోహైడ్రోట్లు ఎక్కువగా కలిగిన ఆహారాన్ని తీసుకున్న మగ ఎలుకకు తీవ్ర స్థాయిలో ఆదుర్దా కలిగిన మగ సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అలాగే.. అధిక కొవ్వు తిన్న మగ ఎలుకలు జత కట్టినప్పుడు జీవక్రియ వ్యాధి లక్షణాలు కలిగిన ఆడ ఎలుకలు పుట్టే ఆస్కారం ఎక్కువని వివరించింది. తండ్రి తీసుకునే ప్రొటీన్‌, కొవ్వు, కార్బోహైడ్రేట్ల నిష్పత్తిలో మార్పుల ద్వారా సంతానంలో నిర్దష్ట అంశాలపై ప్రభావం పడుతుందని ఇది స్పష్టంచేస్తున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని