పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు

గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది.

Published : 23 Apr 2024 05:05 IST

దిల్లీ: గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. గర్భంలోని ద్రవాల వల్ల ఎదురయ్యే పీడనాన్ని హైడ్రోస్టాటిక్‌ ప్రెజర్‌గా పేర్కొంటారు. దీన్ని పిండం గుర్తించగలదని పరిశోధకులు తెలిపారు. లండన్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ఎలుకలు, కప్ప పిండాలు, మానవ మూలకణాలతో ల్యాబ్‌లో వృద్ధి చేసిన ఆకృతులపై పరిశోధనలు చేసి, ఈ విషయాన్ని తేల్చారు. ఆరంభంలో మానవ మూలకణాలు నిర్దిష్ట విధులను నిర్వర్తించలేవు. కాలానుగుణంగా వాటి తీరులో మార్పు వస్తుంది. అవి కండరాలు, రక్తం లేదా మెదడు వంటి కణాలుగా రూపాంతరం చెందగలవు. కణజాల నిర్వహణ, గాయమైనప్పుడు మరమ్మతులకూ ఇవి అవసరం. ‘‘ఒక జీవికి ఎదురయ్యే పీడనంలో మార్పులు వస్తే.. గర్భిణిలోని పిండం సహా అన్ని కణాలు దాన్ని గుర్తించగలవు’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన రాబర్టో మేయర్‌ తెలిపారు. ముఖాకృతిలోని అవకారాలు.. జన్యువుల ద్వారానే కాక గర్భంలో పీడనం నుంచి ఎదురయ్యే భౌతిక సంకేతాల వల్ల కూడా తలెత్తుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని