ఉగ్రవాద నిర్మూలనకు పాక్‌, ఇరాన్‌ ప్రతిన

ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్‌, ఇరాన్‌ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి.

Published : 23 Apr 2024 05:06 IST

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్‌, ఇరాన్‌ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. పాక్‌ పర్యటనకు వచ్చిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ చర్చలు జరిపారు. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతికపరమైన సంబంధాలను పెంపొందించుకునే చర్యలపై సమాలోచనలు చేశారు. పాక్‌లో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక దేశాధినేత ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. వారి సమక్షంలో ఎనిమిది ఒప్పంద పత్రాలపై ఇరుదేశాల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 1,000 కోట్ల డాలర్లకు చేర్చాలనేది వీటిలో ఒకటి.

కశ్మీర్‌ను ప్రస్తావించని రైసీ

ఇద్దరు నేతలు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడినప్పుడు కశ్మీర్‌ అంశాన్ని షరీఫ్‌ ప్రస్తావిస్తూ- ఇరాన్‌ వైఖరికి కృతజ్ఞతలు తెలిపారు. రైసీ దాని గురించి ప్రస్తావించనేలేదు. పాలస్తీనాలో అణచివేతపై పోరాడుతున్నవారికి ఇరాన్‌ మద్దతు ఉంటుందని మాత్రం చెప్పారు. పాక్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీతోనూ రైసీ భేటీ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని