ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్‌జెన్‌ వీసా

తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్‌జెన్‌ వీసా పొందొచ్చు.

Updated : 23 Apr 2024 06:13 IST

నిబంధనలను సరళీకరించిన ఈయూ

దిల్లీ: తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్‌జెన్‌ వీసా పొందొచ్చు. ఈ మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను ఐరోపా కమిషన్‌ సరళీకరించింది.  ‘‘భారతీయులకు బహుళ ప్రవేశ వీసాలకు సంబంధించి కొత్త నిబంధనలను ఐరోపా కమిషన్‌ ఆమోదించింది. ఇవి ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా ప్రామాణిక నిబంధనల కంటే మరింత అనుకూలమైనవి’’ అని ఈయూ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘కొత్త నిబంధనల ప్రకారం.. గత మూడు సంవత్సరాల్లో రెండు వీసాలను పొంది, చట్టబద్ధంగా వినియోగించిన భారతీయులకు దీర్ఘకాల, బహుళ ప్రవేశ షెన్‌జెన్‌ వీసాలను రెండేళ్ల కాలపరిమితికి జారీ చేయవచ్చు. సాధారణంగా ఈ రెండేళ్ల వీసా తర్వాత సంబంధిత ప్రయాణికుడి పాస్‌పోర్ట్‌లో సరిపడినంత చెల్లుబాటు గడువు సమయం ఉన్నట్లైతే ఐదేళ్ల వీసా జారీచేస్తారు. ఈ వీసాల చెల్లుబాటు సమయంలో సంబంధిత వ్యక్తులు వీసా ఫ్రీ దేశాల జాతీయులతో సమానంగా ప్రయాణ హక్కులను పొందుతారు’’ అని వివరించింది. ప్రస్తుతం షెన్‌జెన్‌ పరిధిలో 29 ఐరోపా దేశాలు ఉన్నాయి. అందులో 25 ఈయూ దేశాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు