సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!

పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్‌లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది.

Published : 23 Apr 2024 05:08 IST

అది కొన్ని అధికరణలను అతిక్రమిస్తోంది
అమెరికా కాంగ్రెస్‌ స్వతంత్ర పరిశోధన విభాగం నివేదికలో వెల్లడి

వాషింగ్టన్‌: పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్‌లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. ‘మూడు దేశాల్లోని 6 మతాలకు చెందిన ముస్లిమేతర మైనారిటీలు భారత్‌కు శరణార్థులుగా వస్తే పౌరసత్వం ఇచ్చే సీఏఏలోని నిబంధనలు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడేలా ఉన్నాయి’ అని ఆ విభాగం తెలిపింది. కాంగ్రెస్‌ పరిశోధన సేవల సంస్థ (సీఆర్‌ఎస్‌) ‘ఇన్‌ ఫోకస్‌’ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. అయితే ఈ నివేదికను కాంగ్రెస్‌ అధికారికంగా గుర్తించదు. సభ్యులకు అవగాహన కోసమే రూపొందిస్తారు. ‘దేశంలో హిందువుల మెజారిటీ కోసం ప్రధాని మోదీ, భాజపా పెద్దలు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని దీనిని వ్యతిరేకించేవారు ఆరోపిస్తున్నారు. ముస్లింలకు ఇది వ్యతిరేకంగా ఉందంటున్నారు. ఇది భారత సెక్యులర్‌, రిపబ్లిక్‌ హోదాకు ప్రమాదకరంగా మారిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని