ఇజ్రాయెల్‌ సైనిక నిఘా చీఫ్‌ రాజీనామా

ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు.. హమాస్‌ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్‌ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్‌ జనరల్‌ అహరాన్‌ హలీవా రాజీనామా చేశారు.

Published : 23 Apr 2024 05:10 IST

జెరూసలెం: ఇజ్రాయెల్‌ నిఘా వర్గాలు.. హమాస్‌ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్‌ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్‌ జనరల్‌ అహరాన్‌ హలీవా రాజీనామా చేశారు. ఈ వ్యవహారంలో రాజీనామా చేసిన మొదటి సీనియర్‌ సైనికాధికారి ఆయనే. హలీవాకు సైన్యంలో 38 ఏళ్ల అనుభవం ఉంది. ఉగ్రవాదుల ప్రణాళికలను గుర్తించడంలో వైఫల్యాన్ని ఆయన అంగీకరించారు. తన స్థానంలో మరొకరు నియమితులైన తర్వాత వైదొలగనున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని