గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు

మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి.

Published : 24 Apr 2024 05:29 IST

10 మంది మృతి
మలేసియాలో దుర్ఘటన

కౌలాలంపూర్‌: మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. ఆ హెలికాప్టర్లలో ఉన్న మొత్తం 10 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర పెరక్‌ రాష్ట్రంలోని నౌకా స్థావరంలో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో వేగంగా విన్యాసాలు చేస్తున్న ఓ హెలికాప్టర్‌ మరో హెలికాప్టర్‌ రోటర్‌ను ఢీకొంది. దీంతో నేలకొరిగిన రెండు హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయి. వీటిల్లో ఒకటి విన్యాసాలు జరుగుతున్న ప్రాంతానికి పక్కనే ఉన్న స్టేడియంలో కూలిపోగా మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని