అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్‌

ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ వాదిస్తున్నారని ఆరోపించారు.

Updated : 25 Apr 2024 05:47 IST

వాషింగ్టన్‌: ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ వాదిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని తన మద్దతుదారులను ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని బైడెన్‌ అన్నారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు తన దగ్గరకు వచ్చి ‘మీరే గెలవాలి’ అని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం నిలబడుతుందని వారు భావిస్తున్నారని పేర్కొన్నారు. యావత్‌ ప్రపంచం అమెరికావైపే చూస్తోందని చెప్పారు. ఎవరు గెలుస్తారనే అంశం కంటే.. ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపైనే అందరూ దృష్టి సారించారని తెలిపారు.

500 మిలియన్‌ డాలర్ల విరాళాలు..

తన ప్రచారం అద్భుతంగా సాగుతోందని బైడెన్‌ తెలిపారు. ఇప్పటి వరకు తమకు 500 మిలియన్ల డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. వీటిని 16 లక్షల మంది దాతలు అందించారని వెల్లడించారు. వీరిలో 97 శాతం మంది 200 డాలర్ల కంటే తక్కువ మొత్తంలోనే ఇచ్చారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు