ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో

ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది.

Published : 25 Apr 2024 04:49 IST

జకార్తా: ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. ఆయన ఈ ఏడాది అక్టోబరులో బాధ్యతలు చేపట్టనున్నారు. సుబియాంతో ప్రస్తుతం ఇండొనేసియా రక్షణ మంత్రిగా ఉన్నారు. వాస్తవానికి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికను గత నెల 20నే ఎన్నికల సంఘం ప్రాథమికంగా ప్రకటించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 58.6% ఓట్లు వచ్చినట్లు తెలిపింది. అయితే అధ్యక్ష పదవికి పోటీ పడిన మరో ఇద్దరు నేతలు- అనీస్‌ బస్వెదన్‌, గంజర్‌ ప్రనోవో ఆ ప్రకటనను ఆక్షేపించారు. ఎన్నికల్లో తీవ్రస్థాయి అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం అనుచితంగా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుందని విమర్శించారు. సుబియాంతో ఎన్నికను దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. వారి పిటిషన్లను కోర్టు సోమవారం కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని