పర్యావరణ హితులకు యూఏఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లు

పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Published : 18 May 2024 04:48 IST

దుబాయి: పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న వ్యక్తుల కోసం సుదీర్ఘకాలం చెల్లుబాటు అయ్యేలా ‘బ్లూ రెసిడెన్సీ వీసా’ను తీసుకురానుంది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ వీసాల జారీకి ఆమోదం తెలిపినట్లు యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ వెల్లడించారు. పర్యావరణ సమతుల్యతతోనే తమ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం ముడిపడి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఈ ప్రత్యేక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’లను జారీ చేయనున్నారు. ఇవి పొందిన వారికి యూఏఈలో పదేళ్ల నివాస అనుమతితోపాటు అక్కడి పర్యావరణ ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యే అవకాశం కల్పించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు