నరమేధానికి పాల్పడలేదు

గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్‌ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది.

Published : 18 May 2024 04:49 IST

అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్‌ వాదనలు

ది హేగ్‌ (నెదర్లాండ్స్‌): గాజాలో తాము నరమేధానికి పాల్పడుతున్నామన్న ఆరోపణలను ఇజ్రాయెల్‌ తిరస్కరించింది. పౌరుల భద్రత కోసం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అంతర్జాతీయ న్యాయస్థానానికి (ఐసీజే) తెలిపింది. రెండో రోజైన శుక్రవారం ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా మోపిన నరమేధం అభియోగాలపై విచారణ జరిగింది. ఇజ్రాయెల్‌ వాదనల సందర్భంగా ఓ మహిళ లేచి ‘అబద్ధాలకోరులు’ అని బిగ్గరగా అరిచింది. దీంతో విచారణకు కొంతసేపు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాపై ఇజ్రాయెల్‌ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆ దేశం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఆరోపించింది. గాజాకు తాము నిరంతరాయంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా మానవతా సాయాన్ని పంపిస్తున్నామని ఇజ్రాయెల్‌ న్యాయవాదులు పేర్కొన్నారు.  

అమెరికా ఎంక్యూ-9 ప్రిడేటర్‌ డ్రోన్‌ను కూల్చినట్లు శుక్రవారం యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. గతంలో ఐదు డ్రోన్లను అమెరికా కోల్పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని