మరింత సంపన్నులైన రిషి, అక్షతా దంపతులు

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు.

Published : 18 May 2024 06:06 IST

మొత్తం సంపద విలువ రూ.6,873 కోట్లు
సండేటైమ్స్‌ సంపన్నుల జాబితాలో 245వ స్థానానికి చేరిక

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తిలు మరింత సంపన్నులు అయ్యారు. రెండేళ్ల క్రితం సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న వీరు, శుక్రవారం విడుదలైన జాబితాలో తమ ర్యాంకును మరింత మెరుగు పరచుకుని అత్యంత సంపన్నులైన బ్రిటన్‌ ప్రధానమంత్రి దంపతులుగా అవతరించారు. ఇన్ఫోసిస్‌ కంపెనీలో అక్షతా మూర్తికి ఉన్న షేర్లే ఇందుకు కారణం. సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో గతేడాది 275గా స్థానంలో ఉన్న ఈ జంట, ఈ ఏడాది సుమారు రూ.6,873 కోట్ల (651 మిలియన్‌ పౌండ్లు) సంపదతో ర్యాంకును మెరుగు పరచుకుని 245వ స్థానానికి చేరింది. 2022-23లో రిషి సునాక్‌ సుమారు రూ.23 కోట్లు (2.2 మిలియన్‌ పౌండ్లు) సంసాదించగా, ఆయన సతీమణి అక్షతామూర్తి డివెండెండ్ల రూపంలో ఏకంగా రూ.137 కోట్లు (13 మిలియన్‌ పౌండ్లు) అందుకున్నారు. వీరి ఆస్తిలో సింహభాగం అక్షతామూర్తికి ఇన్ఫోసిస్‌లో ఉన్న షేర్లే కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు