ఆగ్నేయాసియాలో రక్తపోటు బాధితులు 29.4 కోట్ల మంది : డబ్ల్యూహెచ్‌వో

అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా రీజనల్‌ డైరెక్టర్‌ సైమా వాజెడ్‌ చెప్పారు.

Published : 18 May 2024 04:52 IST

దిల్లీ: అధిక రక్తపోటు కారణంగా గుండె పోటు, పక్షవాతం, క్యాన్సర్ల లాంటి సాంక్రమికేతర వ్యాధులతో పాటు మరణం, వైకల్యం సంభవించే ముప్పు ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా రీజనల్‌ డైరెక్టర్‌ సైమా వాజెడ్‌ చెప్పారు. ఆగ్నేయాసియాలో 29.4 కోట్లకు పైగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్లు తెలిపారు. ‘ప్రపంచ రక్తపోటు దినం’ సందర్భంగా.. శుక్రవారం ఆమె మాట్లాడుతూ రక్తపోటును నియంత్రించడానికి పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరముందన్నారు. అధిక ఉప్పు వినియోగం, పొగాకు, ఆల్కహాల్‌ తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, వాయు కాలుష్యం వంటివి అధిక రక్తపోటు పెరగడానికి ముఖ్య కారణాలని సైమా వాజెడ్‌ పేర్కొన్నారు. దాదాపు ఆరుగురిలో ఒకరికి తమ రక్తపోటు నియంత్రణలో ఉండదని తెలిపారు. వయోజనుల్లో సగం మందికి తమకు రక్తపోటు ఉందన్న విషయమే తెలియదని ఆమె అన్నారు. రక్తపోటు సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ముప్పును తగ్గించొచ్చని చెప్పారు. కాగా ‘మీ రక్తపోటును కచ్చితత్వంతో తెలుసుకోండి. దానిని నియంత్రించి ఎక్కువ కాలం జీవించండి’ అనే థీమ్‌ను ఈ ఏడాది డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని