సింగపూర్‌లో మళ్లీ కొవిడ్‌ అలజడి

కొవిడ్‌-19 మహమ్మారి సింగపూర్‌లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్‌ యె కుంగ్‌ తెలిపారు.

Updated : 19 May 2024 06:18 IST

మాస్కులు ధరించాలని మంత్రి ఆదేశం

సింగపూర్‌: కొవిడ్‌-19 మహమ్మారి సింగపూర్‌లో మరోసారి కలకలం రేకెత్తిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 మధ్య 25,900కుపైగా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఆంగ్‌ యె కుంగ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు ధరించాలని కోరారు. ‘‘కొత్తగా కొవిడ్‌ ఉద్ధృతి మొదలవుతోంది. అది క్రమంగా పెరుగుతోంది. నాలుగు వారాల్లో అది గరిష్ఠ స్థాయికి చేరవచ్చు’’ అని తెలిపారు. నిత్యం దాదాపు 250 మంది కొవిడ్‌ బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ఆసుపత్రులు కూడా సంసిద్ధం కావాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. రోగులకు పడకలను అందుబాటులో ఉంచాలని తెలిపింది. అత్యవసరంకాని శస్త్రచికిత్సలను వాయిదా వేయాలని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని