ఆకాశంలో రాకాసి ఉల్క

స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది.

Published : 20 May 2024 05:06 IST

రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ భారీ ఉల్క భూమిపై పడింది. భూవాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి లోనై నీలివర్ణపు వెలుగులను వెదజల్లింది. ఫలితంగా రాత్రి సమయం.. పట్టపగలును తలపించింది. ఇది ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఈ ఉల్క వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఉల్క ఎక్కడ నేలను తాకిందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఇది క్యాస్ట్రోడైరో ప్రాంతంలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని