రష్యా, ఉక్రెయిన్‌ పరస్పర దాడులు

రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పరం డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. దీనివల్ల పలుచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తమ దేశంలోకి వచ్చిన 57 డ్రోన్లు, పలు క్షిపణులను కూల్చేశామని రష్యా ప్రకటించింది.

Published : 20 May 2024 04:03 IST

కీవ్‌: రష్యా, ఉక్రెయిన్‌లు పరస్పరం డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. దీనివల్ల పలుచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. తమ దేశంలోకి వచ్చిన 57 డ్రోన్లు, పలు క్షిపణులను కూల్చేశామని రష్యా ప్రకటించింది. దక్షిణ క్రాస్నోడర్‌ ప్రాంతంలో ఇది జరిగినట్లు అధికారులు తెలిపారు. శ్లావ్యాన్స్‌ ఆన్‌ కుబాన్‌ పట్టణంలోని ఒక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్‌ శకలాలు పడ్డాయి. ఉక్రెయిన్‌ ప్రయోగించిన 9 దీర్ఘశ్రేణి క్షిపణులు, ఒక డ్రోన్‌ను నేల కూల్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. బెల్గోరోడ్‌ ప్రాంతంపై మూడు డ్రోన్లను ధ్వంసం చేశామన్నారు.  రష్యా పాక్షికంగా ఆక్రమించిన ఖేర్సన్‌ ప్రాంతంలో ఒక మినీ బస్సుపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ పడింది. దీనివల్ల ఒకరు చనిపోగా 16 మంది గాయపడ్డారు. మరోవైపు తమ దేశంపైకి రష్యా ప్రయోగించిన 37 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలతో కూల్చేశామని ఉక్రెయిన్‌ వైమానిక దళ అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని ఈశాన్య ప్రాంతంపై పుతిన్‌ సేన విరుచుకుపడింది. ఆదివారం ఉదయం ఖర్కీవ్‌ శివార్లలో జరిగిన శతఘ్ని దాడిలో నలుగురు పౌరులు చనిపోగా 15 మంది గాయపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని