అఫ్గాన్‌లో కొనసాగుతున్న కుండపోత వర్షాలు

అధిక వర్షాలు అఫ్గానిస్థాన్‌ను అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. కుండపోత వానలకు వరదలు తోడు కావడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది.

Published : 20 May 2024 04:51 IST

ఇస్లామాబాద్‌: అధిక వర్షాలు అఫ్గానిస్థాన్‌ను అల్లకల్లోలానికి గురిచేస్తున్నాయి. కుండపోత వానలకు వరదలు తోడు కావడంతో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. శనివారం రాత్రి ఫర్యాబ్‌ ప్రావిన్స్‌లో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. అయిదుగురు గాయపడగా, ఎనిమిది మంది గల్లంతైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ తీవ్రతతో 1500 ఇళ్లు నేలమట్టం కాగా.. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 300 వరకూ మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. శుక్రవారం సంభవించిన వరదలకు 50 మంది చనిపోయారు. ఇప్పటివరకూ మొత్తం 300 మంది వరకూ మృతి చెంది ఉంటారనీ.. నిరాశ్రయులకు సరైన తిండి, వసతి కరవైందని వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని