విషమంగానే స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో ఆరోగ్యం

స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికో (59) ఆరోగ్యం ఆదివారమూ విషమంగానే ఉంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికోపై ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే.

Published : 20 May 2024 04:51 IST

బన్‌స్కా బైస్ట్రికా: స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికో (59) ఆరోగ్యం ఆదివారమూ విషమంగానే ఉంది. దేశ రాజధాని బ్రటిస్లావాకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో ఫికోపై ఓ దుండగుడు బుధవారం కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్న విధానంలో పురోగతి కనిపిస్తోందని ఆ దేశ రక్షణ మంత్రి రాబర్ట్‌ కలినాక్‌ తెలిపారు. మరోవైపు, ప్రధానమంత్రికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రి డైరెక్టర్‌ మిలిన్‌ ఉర్బానీ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వైద్యులు ఉదయపు పరిశీలన తర్వాత... ఫికో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు భావిస్తున్నాం. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. కోలుకోవడానికి ఆయనకు చాన్నాళ్లపాటు విశ్రాంతి అవసరం. అంతా మంచే జరుగుతుందని మేం భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని