కాంగోలో తిరుగుబాటుకు విఫలయత్నం

దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది.

Published : 20 May 2024 04:52 IST

తిప్పికొట్టిన సైన్యం

కిన్షాసా: దేశంలో తిరుగుబాటుకు జరిగిన ప్రయత్నాన్ని వమ్ము చేసినట్లు కాంగో సైన్యం ఆదివారం ప్రకటించింది. దీనికి సంబంధించి పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపింది. వీరిలో విదేశీయులూ ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు రాజధాని కిన్షాసాలో కాంగో అధ్యక్షుడికి సన్నిహితుడైన ఫెడరల్‌ ఎంపీ విటల్‌ కమెర్హే భద్రతా సిబ్బందికి, సైనిక దుస్తుల్లో ఉన్న దుండగులకు మధ్య కాల్పులు జరిగాయి. అధ్యక్ష భవనానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ఇద్దరు పోలీసు అధికారులు, ఒక దుండగుడు చనిపోయారు. తిరుగుబాటుదారులను ప్రవాసంలో ఉన్న విపక్షనేత క్రిస్టియన్‌ మలంగా అనుచరులుగా గుర్తించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటన తర్వాత అధ్యక్షుడు ఫెలిక్స్‌ షిసెకెడికి హెచ్చరికలు చేస్తూ మలంగా.. ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పెట్టారు. గత ఏడాది డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో ఫెలిక్స్‌.. దేశాధ్యక్షుడిగా తిరిగి విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో పారదర్శకత కొరవడిందని, మళ్లీ ఓటింగ్‌ నిర్వహించాలని విపక్షం డిమాండ్‌ చేస్తోంది. ‘‘తిరుగుబాటు కోసం జరిగిన ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచేశాం. పరిస్థితి ఇప్పుడు అదుపులో ఉంది’’ అని సైనిక అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ సిల్వియన్‌ ఎకెంగే తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని