అసాంజేకు భారీ ఊరట

గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు సోమవారం లండన్‌ న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది.

Published : 21 May 2024 04:18 IST

లండన్‌: గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు సోమవారం లండన్‌ న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. తనను అమెరికాకు అప్పగించడాన్ని ఆయన సవాలు చేసేందుకు న్యాయస్థానం అనుమతించింది. ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న అసాంజే 2019లో అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆయన్ను అత్యంత భద్రత గల బెల్‌మార్ష్‌ జైలులో ఖైదు చేసిన సంగతి తెలిసిందే. వర్గీకృత పత్రాలను బహిర్గతం చేసి అసాంజే ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేశారని, ఆయన విచారణను ఎదుర్కోవాల్సిందేనని అమెరికా అధికారులు చెబుతుండగా, అసాంజే తరఫు న్యాయవాదులు మాత్రం ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనదని వాదించారు. మరోవైపు సోమవారం విచారణ సందర్భంగా రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌కు చెందిన ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు ‘అప్పగింత ఆదేశం’ను సవాలు చేస్తూ అభ్యర్థన దాఖలు చేసేందుకు వికీలీక్స్‌ వ్యవస్థాపకుడికి అనుమతి ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని