శ్రీలంక ఆలయంలో సరయు నదీ జలాలతో కుంభాభిషేకం

శ్రీలంకలోని సీతా అమ్మన్‌ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్‌కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్‌ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపింది.

Published : 21 May 2024 04:18 IST

కొలంబో: శ్రీలంకలోని సీతా అమ్మన్‌ ఆలయానికి ఆదివారం నిర్వహించిన కుంభాభిషేకం కార్యక్రమంలో శ్రీలంక, భారత్, నేపాల్‌కు చెందిన వేల మంది భక్తులు పాల్గొన్నట్లు భారత హైకమిషన్‌ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపింది. సీతా ఎలియా అనే గ్రామంలో జరిగిన ఈ వేడుకలో అయోధ్య నుంచి ప్రవహించే పవిత్రమైన సరయు నది జలాలను ఉపయోగించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంకలో భారత హైకమిషనర్‌ సంతోష్‌ ఝా, ఆధ్మాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ హాజరయ్యారు. భారత్, నేపాల్‌ దేశాలు అందించిన వస్త్రాలతో పాటు, తిరుపతి నుంచి పంపించిన ప్రసాదాలను సీతా దేవికి సమర్పించడంతో ఈ కార్యక్రమం ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు