తబ్రిజ్‌లో రైసీ సంతాప యాత్ర

హెలికాప్టర్‌ దుర్ఘటనలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇతరుల స్మృత్యర్థం ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించిన సంతాప కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

Updated : 22 May 2024 04:58 IST

నల్ల దుస్తులతో వేల మంది హాజరు
రేపు అంత్యక్రియలు

టెహ్రాన్‌: హెలికాప్టర్‌ దుర్ఘటనలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇతరుల స్మృత్యర్థం ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించిన సంతాప కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని తబ్రిజ్‌ పట్టణంలో మంగళవారం శవపేటికలతో సంతాప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లదుస్తులతో, ఇరాన్‌ జెండాలు పట్టుకొని వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శవపేటికలపైకి పూలు చల్లారు. రైసీ, విదేశాంగమంత్రి హొస్సేన్‌ అమిర్‌ అబ్దొల్లాహియన్‌ భౌతిక కాయాలను రాజధాని టెహ్రాన్‌కు తరలించనున్నారు. బుధవారం టెహ్రాన్‌లో భారీస్థాయిలో అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరాన్‌ సుప్రీం నేత ఖమేనీ పాల్గొని ప్రార్థనలు నిర్వహిస్తారు. తర్వాత రైసీ భౌతికకాయాన్ని ఆయన పుట్టి పెరిగిన మషాద్‌ నగరానికి తీసుకువెళతారు. గురువారం అక్కడే అంత్యక్రియలు ఘనంగా నిర్వహిస్తారు. 

ఇరాన్‌కు ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌

దిల్లీ: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి, విదేశాంగ మంత్రి అబ్దొల్లాహియన్‌కు భారత్‌ తరఫున అధికారికంగా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బుధవారం ధన్‌ఖఢ్‌ ఇరాన్‌ చేరుకుంటారని, హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన నేతలిద్దరికీ భారత్‌ తరఫున నివాళులు అర్పిస్తారని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని