సింగపూర్‌ విమానంలో భారీ కుదుపులు

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవడంతో ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

Updated : 22 May 2024 08:46 IST

కుదుపులకు గురై థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో దిగిన సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌

బ్యాంకాక్‌: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవడంతో ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. లండన్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న ఎస్‌క్యూ321 విమానంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ వెల్లడించింది. ఆ సమయంలో విమానంలో ముగ్గురు భారతీయులు సహా మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. మార్గమధ్యలో విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయానికి మళ్లించినట్లు సంస్థ పేర్కొంది. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నామని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని