బోకోహారమ్‌ ఉగ్రవాదుల చెరలోని 350 మంది బందీలకు విముక్తి

ఈశాన్య నైజీరియాలో బోకోహారమ్‌ ఉగ్రవాదుల చెరలో నెలలు, సంవత్సరాలు బందీలుగా ఉన్న 350 మందిని రక్షించినట్లు అక్కడి సైన్యం తెలిపింది. సాంబిసా అటవీ ప్రాంతంలో వీరిని బందీలుగా ఉంచినట్లు నైజీరియన్‌ ఆర్మీ అధికారి మేజర్‌ జనరల్‌ కెన్‌ చిగ్బు తెలిపారు.

Published : 22 May 2024 05:07 IST

మైదుగురి(నైజీరియా): ఈశాన్య నైజీరియాలో బోకోహారమ్‌ ఉగ్రవాదుల చెరలో నెలలు, సంవత్సరాలు బందీలుగా ఉన్న 350 మందిని రక్షించినట్లు అక్కడి సైన్యం తెలిపింది. సాంబిసా అటవీ ప్రాంతంలో వీరిని బందీలుగా ఉంచినట్లు నైజీరియన్‌ ఆర్మీ అధికారి మేజర్‌ జనరల్‌ కెన్‌ చిగ్బు తెలిపారు. విముక్తి పొందిన 209 మంది పిల్లలు, 135 మంది మహిళలు, ఆరుగురు పురుషులు చిరిగిన దుస్తులతో డస్సిపోయి ఉన్నారు. వారిలో కొందరు బాలికలు చిన్నారులతో కనిపించడంతో ఉగ్రవాదులు వారిపై అత్యాచారానికి పాల్పడడం లేదా బలవంతంగా పెళ్లి చేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. వారి చెర నుంచి తప్పించుకోబోతూ దొరికితే తీవ్రంగా హింసిస్తారని నిరవధికంగా జైలులోనే ఉంచుతారని ఓ మహిళ తెలిపారు. రోజుల తరబడి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి కాపాడిన బందీలను బోర్నో రాష్ట్ర ప్రభుత్వ గృహానికి ట్రక్కుల్లో తరలించినట్లు సైన్యం పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో కొందరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపింది. నైజీరియాలో ఇస్లామిక్‌ షరియా చట్టాన్ని స్థాపించాలంటూ బోకోహారమ్‌ ఉగ్రవాదులు 2009 నుంచి తిరుగుబాటు చేస్తూ దేశంలో హింసకు పాల్పడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని