జులై 4న బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలు

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధానమంత్రి రిషి సునాక్‌ తెరదించారు. జులై 4న వాటిని నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించారు. తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు తెలిపారు.

Published : 23 May 2024 06:19 IST

లండన్‌: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధానమంత్రి రిషి సునాక్‌ తెరదించారు. జులై 4న వాటిని నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటించారు. తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు తెలిపారు. లండన్‌లో జోరుగా వర్షం కురుస్తున్నవేళ.. తన అధికారిక నివాసమైన ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’ మెట్లపై నిలబడి తడుస్తూనే ఆయన ప్రసంగించారు. బ్రిటన్‌ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా తన హయాంలో సాధించిన విజయాలను గుర్తుచేశారు. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కంటే విపక్ష లేబర్‌ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేస్తుండడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని