భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

ఖగోళశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక ‘షా ప్రైజ్‌’ భారత సంతతి శాస్త్రవేత్తను వరించింది. గామా కిరణాల పేలుళ్లు, సూపర్‌నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో కనుగొన్న విషయాలకుగానూ అమెరికాకు చెందిన ఆస్ట్రానమీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ఆర్‌.కులకర్ణికి ఈ అవార్డు లభించిందని షా ప్రైజ్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది.

Published : 23 May 2024 05:04 IST

హాంకాంగ్‌: ఖగోళశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక ‘షా ప్రైజ్‌’ భారత సంతతి శాస్త్రవేత్తను వరించింది. గామా కిరణాల పేలుళ్లు, సూపర్‌నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో కనుగొన్న విషయాలకుగానూ అమెరికాకు చెందిన ఆస్ట్రానమీ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ఆర్‌.కులకర్ణికి ఈ అవార్డు లభించిందని షా ప్రైజ్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. కులకర్ణి కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రొఫెసర్‌. ఆయనతో పాటు మెడిసిన్, లైఫ్‌సైన్స్‌ విభాగంలో స్వీ లే థీయెన్, స్టువర్ట్‌ ఆర్కిన్‌ సంయుక్తంగా ‘షా ప్రైజ్‌’ను గెలుచుకున్నారు. గణితశాస్త్రంలో పీటర్‌ సార్నక్‌ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఈ ముగ్గురూ అమెరికాకు చెందినవారే. ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి సుమారు రూ.10 కోట్లు (1.2 మిలియన్‌ డాలర్లు) బహుమతిగా అందనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని